నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ప్రశ్నోత్తరాలలో కడప నగరంలో తాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, తణుకులో ఈఎస్‌ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు, విద్యా శాఖలో ఖాళీలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు, డిస్కంలచే కొనుగోళ్లలో అక్రమాలు, భీమిలీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ-జూనియర్ కళాశాలలు, మనుషుల అక్రమ రవాణా తదితర సమస్యలపై ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. వాటికి మంత్రులు సమాధానాలు చెబుతారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల అనంతరం వార్షిక బడ్జెట్‌పై చివరి రోజు చర్చ కొనసాగనుంది. ఆ తర్వాత ప్రభుత్వం సభలో రెండు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. ఆంధ్రపదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టసవరణ బిల్లును విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కౌన్సిల్‌లో ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. కరువు పీడిత మండలాలు, నూతన మద్యం విధానం, భూ కబ్జాలు, దీపం 2 పథకం, మైనింగ్ కార్యకలాపాలలో అవకతవకలు, డ్వాక్రా మహిళలకు సున్న వడ్డీ పథకం, సిద్ధం సభలకు చేసిన వ్యయం, బలహీన వర్గాలకు పింఛనులు, నూతన వైద్య కళాశాలల్లో సౌకర్యాలు, నిరుద్యోగ యువతకు భృతి తదితర సమస్యలు చర్చించనున్నారు.