వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 15.5లక్షల మంది రైతులకు రూ. 1820.23 కోట్ల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని.. ఈ నెలలోనే రైతుల కోసం రైతు భరోసా కింద నేరుగా వారి ఖాతాల్లోకి 3,928 కోట్లు పంపామని.. ఇదే నెలలోనే 15.5 లక్షల మందికి రైతులకు మేలు జరిగేలా రూ.1820.33 కోట్లు ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ నెలలోనే…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని గుంట నక్కలా చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడని ఫైర్ అయ్యారు. “నలుగురు ఎవరి గురించైనా అభిమానంగా చర్చిం చుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుంది. అందులోకి ఎలా దూరాలా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని స్కెచ్ వేస్తున్నాడు గుంట…
కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మందు నిలిపివేసినా.. బ్లాక్ లో మాత్రం దందా కొనసాగుతోంది. హైదరాబాద్ కు చెందిన రవి బంధువుల కోసం ఐడ్రాప్స్ రూ. 20,000కు భేరం అడినట్లు సమాచారం. ఉచితంగా ఇచ్చే దానికి రూ. 20,000 ఎందుకు అని రవి స్నేహితుడు సాయి ప్రశ్నించగా.. డబ్బులు లాక్కుని కృష్ణ పట్నం నాగరాజు పరారయ్యాడు. దీంతో పోలీసులకు సాయి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మందు హానికరం కాదని నివేదిక రావడంతో మరింత…
ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాల డిగ్రీ ఫీజుల జీవో రద్దు చేసింది ఏపీ హైకోర్టు. ఫీజుల సిఫార్సు అంశంలో ఏపీ ఉన్నత విద్యా కమిషన్ తీరును తప్పుబట్టింది హైకోర్టు. అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫీజుల అంశంలో చట్ట నిబంధనలు పాటించకపోవడాన్ని తప్పుపట్టిన హైకోర్టు..వ్యక్తిగతంగా కానీ, నేరుగా కానీ కళాశాలల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సొంత రుసుములను కమీషన్ సిఫార్సు చట్టఉల్లంఘనే అని పేర్కొంది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఫీజులు…
ఇండియాలో కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్…
రఘురామకృష్ణరాజు విడుదలపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు పంపారు రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్. రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తీసుకురావాలని ఎస్కార్ట్ను ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్ పై విడుదలైనట్లేనని..విడుదలైన 10 రోజులకు బాండ్లను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని న్యాయవాది దుర్గాప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని ఎస్కార్ట్ ను పంపడం కోర్టు ఆదేశాలను…
పొరుగు రాష్ట్రాలలో ఈ పాస్ నిబంధనలను ఆకళింపు చేసుకొని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలు విధించిన నిబంధనలను ప్రజలు అర్థం చేసుకొని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ-పాస్ లేకుండా ప్రయాణించడం ద్వారా రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని డీజీపీ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పొరుగు రాష్ట్రాలలో అమలవుతున్న ఈపాస్ నిబంధనలను పరిశీలించిందని ఆయన…
ప్రభుత్వాన్నీ అస్థిరపరచడం,బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యం అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో లోకేష్ పర్యటనలో కరోనాతో మరణించిన పార్టీ నాయకులు కుటుంబాల పరామర్శ కోసం అని భావించాం. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్… రాజకీయం మాట్లాడి వెళ్లారు. లోకేష్ కు చరిత్ర తెలియదు… టీడీపీ హయాంలోనే కారంచేడులో దళితుల్ని ఊచకోత కోశారు. దళితుల గురించి మాట్లాడే హక్కు లోకేష్, చంద్రబాబుకి లేదు. టీడీపీ అన్ని వర్గాలను దూరం చేసుకున్నందుకే జగన్మోహన్…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 58,835 శాంపిల్స్ పరీక్షించగా 12,994 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 96 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 18,373 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
కరోనా తగ్గుతున్న వేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారా ఆ విషయాన్ని రాజకీయం చేయాలా అని తండ్రి కొడుకులు ఆలోచిస్తారు. చంద్రబాబు రాబందులా… చనిపోయిన వారికి పెట్టే పిండం తినడానికి వచ్చే కాకిలా లోకేష్ తయారయ్యారు అని తెలిపారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు అతని తనయుడు రాజకీయ కుట్రలు చేశారని అందరికీ తెలుసు. కుట్రలో చిక్కుకున్నానని డాక్టర్ సుధాకర్ అప్పుడే…