ఏపీలో మూడు వేలు దాటిన కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి పెరిగాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ 3000 దాటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,87,879 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో కోవిడ్‌తో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇక కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,505 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10, 119 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 281 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 63, 255 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 41,954 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,17,08,637 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Read Also: ఇంట గెలిచి రచ్చ గెలవండి దొరా.. కేసీఆర్‌పై షర్మిల ఫైర్
Also Read
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- OTR : ధర్మవరంలో పోటీ టీడీపీ వర్సెస్ బీజేపీ అవుతుందా?
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
కాగ ఈ రోజు విశాఖలో అత్యధికంగా 695 కేసులు, చిత్తూరులో 607 కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. జనవరి 1వ తేది వరకు రోజుకు 176 కేసులు నమోదయ్యాయి. కానీ ఈ పదిరోజుల్లో ఒక్కసారిగా కేసులు నమోదయ్యాయి. మరో వైపు సంక్రాంతి పండుగ ఉండటంతో చాలా మంది హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి స్వంత ఇళ్లకు చేరుకుంటున్నారు. కాగా దీంతో పండుగ తర్వాత కేసులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరో వైపు ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను సైతం పండగ అనంతరం అమలు చేయనుంది. ఈ లోపులో ఎన్ని కేసులు పెరుగుతాయనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. వైద్యాఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!