ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా లోని కడప రిమ్స్ లో పసికందుల మరణాలు కలవరపరుస్తున్నాయని, కడప రిమ్స్ ఘటనలో ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పసిబిడ్డల తల్లితండ్రులను పోలీసులతో ఎందుకు తరలించారు? కడప నగరంలోని రిమ్స్ వైద్యాలయంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం. విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే పసి బిడ్డలు కన్నుమూశారు. ఒక మానిటర్ తోనే 30మంది…
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పన్నుల పరంపర చిత్రవిచిత్రంగా కొనసాగుతోంది. ఆన్ లైన్ లోపాలతో వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ఖాళీ స్థలాలకు ఇంటి పన్నులు, ఇళ్లకు ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సీడీఎంఏ వెబ్ సైట్ లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో అందుబాటులో టెక్నాలజీ ఉన్నా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను నిర్ధారించే వెబ్ సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు…
ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం…
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో మూడు రోజుల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రేపు ,ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు 12వ తేదీ ఉదయం నుంచి జారీ చేయనున్నారు. తిరుమలకు పూర్వ వైభవం వస్తోంది. కలియుగ వైకుంఠనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో…
విమానం ఎక్కితే మంచి టేస్టీ ఫుడ్ తినవచ్చు. కేవలం అందులో ప్రయాణించేవారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. అయితే అక్కడ ఇప్పుడు భోజనానికి విమానం ఎక్కుతున్నారు. అదేం బొమ్మ విమానం కాదు నిజమైన విమానం. విజయవాడ సిటీ దాటి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి వెళ్లే దారిలో హైవే పక్కన ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఒక్కసారిగా చూసే ఎవరికైనా, నిజంగా ఫ్లైట్ ల్యాండ్ అయిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సాధారణంగా ఫ్లైట్…
కామాతురాణాం నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయం వుండదు.. సిగ్గుశరం వుండవు. విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ ఘటనతో పాఠశాలలకు…
నదిలో పడ్డ వ్యక్తిని కాపాడిన పోలీస్.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు.. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తుంటాం. కోవిడ్ టైంలో అయితే ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేసి ప్రజల్ని రక్షించారు. ఆపదలో ఎవరు వున్నా.. విధి నిర్వహణలో వున్న పోలీసులు తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. ఫ్రెండ్లీ పోలీసులు అనిపించుకుంటూ వుంటారు. గుంటూరు పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. https://ntvtelugu.com/tamilnadu-former-built-a-temple-for-his-pet-dog/ ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు అరండల్ పేట…
కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని జనసేన ఆరోపించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరించారో టీడీపీ, జనసేన మర్చిపోయినట్లు ఉన్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రైతుల రుణమాఫీ రద్దు చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? రైతుల రూ. 87,600 కోట్ల రుణం మాఫీ చేస్తామని చెప్పి…తీరా చేసింది 15వేల కోట్లు మాత్రమే. రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా?…
https://youtu.be/yrr4FjSUabc లక్ష్మీపంచమి ఎంతో శుభప్రదమయిన, యోగదాయకమయిన రోజు. ఈరోజు బుధవారం. అమ్మవారి స్తోత్రపారాయణం చేస్తే సిరిసంపదలు, ఆరోగ్యం కలుగుతాయి.
ఢిల్లీలో కేంద్ర MSME శాఖామంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ను కలిశారు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు. అమరావతి లో “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థ” కు ఐదు ఎకరాల భూమిని శాఖమూరు గ్రామంలో 60 సంవత్సరాల లీజుకు కేటాయించడమైనదని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 20.45 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పై స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ…