కోర్టు ధిక్కార కేసులో నోటీసులు పంపకుండానే వకాల్తా దాఖలు చేయడం పై హైకోర్ట్ సీరియస్ అయింది. నోటీసులు పంపకుండా వకాల్తా తీసుకున్న కోర్టు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీచేశారు. కృష్ణాజిల్లా మొవ్వ మండల డిప్యూటీ తాహసీల్దార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశించిన సమాచారం ఇవ్వకపోవడంతో కోర్టు ధిక్కార పిటీషన్ను దాఖలు చేశారు న్యాయవాది కే.తులసీదుర్గాంబ. నోటీసులు వెళ్లకుండానే…
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణ్ కె. దాస్ నారంగ్ గారు సినీ ఇండస్ట్రీలో అజాత శత్రువు గా పేరొందారు . నైజాం లో ఎగ్జిబిటర్ మరియు పంపిణీదారులుగా విశేష సేవలందించారు .వారి మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. కొడాలి నాని
ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం?గుంటూరు జిల్లాకు చెందిన సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యతోనైనా రెవెన్యూ శాఖలో మార్పు రావాలి. తనకున్న 1.64 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను తప్పుగా నమోదు చేయడమే కాకుండా.. తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ల పాటు తిప్పుకోవడం దారుణం అన్నారు పవన్. Read Also: CM Jagan: గృహనిర్మాణ శాఖపై కీలక సమీక్ష రెవెన్యూ వ్యవస్థ తీరుతో…
గృహనిర్మాణ శాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్లపట్టాలు కోసం చేసిన ఖర్చు కాకుండా కేవలం నిర్మాణం కోసమే గడచిన ఆర్థిక సంవత్సంలో సుమారు రూ.3,600 కోట్లు ఖర్చుచేసింది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 3.46 లక్షల మెట్రిక్టన్నుల స్టీల్ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనుంది ప్రభుత్వం. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల…
ఏపీ ప్రజలకు జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం తన వైఖరి వెల్లడిస్తూనే వుంది. పోలవరం ప్రాజెక్టు 2013 -14 లో అంచనాలకు మేము అంగీకారం తెలిపాం. ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది.. పెరిగిన అంచనాలపై ఒక కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు కేంద్ర జల శక్తి, సహాయ మంత్రి.. ప్రహ్లాద్ సింగ్ పటేల్. దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ కి అరవై వేల కోట్లు కేటాయించాం. ఈ మిషన్లో 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రం…
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమను మూసి వేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీని మూసేసినట్టు ప్రకటిస్తూ బ్యానర్ కట్టింది పోరస్ యాజమాన్యం.బ్యానర్ కడితే సరిపోదు.ఫ్యాక్టరీని సీజ్ చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనకు సీపీఎం మద్దతు ప్రకటించింది. పోరస్ ఫ్యాక్టరీ మూసివేయాలంటూ చేస్తున్న ఆందోళనల్లో పాల్గొన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే పోరస్ బాధిత మృతులకు రూ. కోటి చెల్లించాలన్నారు.ఈ ప్రమాదం వెనుక…
ఏపీలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడే అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పవర్ హాలిడే ఎత్తేయాలని లోకేష్ కోరారు. పవర్లో వున్న మీరు పవర్ హాలీడే ప్రకటించడం చాలా సులువే. కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర పరిస్థితి ఆలోచించారా? మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటుంటే పవర్ హాలిడే…
ఆంధ్రా భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు కడప నగర శివార్లలోని చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. వీఐపీల రాక సందర్భంగా ప్రభుత్వ స్టల్లాల్లోని దుకాణాల తొలగింపుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నో ఏళ్లుగా చిరువ్యాపారాలు చేస్తున్న దుకాణాలను అధికారులు తొలగించే యత్నాలను అక్కడి వ్యాపారులు నిరాశిస్తున్నారు. ఉన్నపళంగా దుకాణాలు తెసేయమంటే మా పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కమలాపురం రోడ్డు లోని విమానాశ్రయం నుంచి కడప నగరంలోకి వచ్చే మార్గంలో అలాంఖాన్ పల్లె ఇర్కాన్ సర్కిల్…
కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోట ఎత్తివేస్తూ నిర్ణయం వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపీ కోటా సీట్లు ఉండవని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్ కి ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంపై ఎంపీలు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రీయ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కేంద్రమంత్రి లెక్కల ప్రకారం గత ఏడేళ్ళలో 12 లక్షలమంది విద్యార్ధులు ప్రవేశాలు పొందారు. గత…