Srisailam Dam : గత 20 రోజులుగా మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నదుల్లో భారీ వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. పూర్తి వర్షాకాలం రాకముందే ఈ సీజన్‌లో రెండోసారి జూరాల డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ వరద నీరు నేరుగా కృష్ణా నదిలోకి చేరి శ్రీశైలం జలాశయాన్ని చేరుతోంది.
Surya : సూర్య – వెంకీ అట్లూరి మూవీ పై క్రేజీ అప్ డేట్..
ఇప్పటికే గత వానకాలంలో వచ్చిన వరదలతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. తాజాగా మరోసారి జూరాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తోంది. అధికారులు పేర్కొన్న ప్రకారం, ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అయితే, శ్రీశైలంలో ప్రస్తుతం ఔట్‌ఫ్లో లేదు.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది 854.20 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం అందులో 89.7132 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
Drunk : కిక్కుకోసం ప్రాణాలతో చెలగాటం.. నిర్మల్‌లో కల్తీ కల్లు ముఠా బస్ట్