AP Tourism: పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్తు.. 2026లో జరిగే 41వ ఐఏటీఓ సదస్సుకు విశాఖపట్నం అతిథ్యం..
- ఒడిశాలోని పూరీలో జరుగుతున్న 40వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీఓ) వార్షిక సదస్సు
- 2026లో జరిగే 41వ ఐఏటీఓ సదస్సుకు విశాఖపట్నం అతిథ్యం ఇస్తుందని ప్రకటించిన అజయ్ జైన్
- పర్యాటకాభివృద్ధిలో టూర్ ఆపరేటర్ల పాత్రను తెలిపిన పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
- ఏపీ పర్యాటకాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంపై ప్రజెంటేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం అతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ఈ నెల 22 నుండి 24 వరకు ఒడిశాలోని పూరీలో స్వోస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు.
Also Read:Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
రిజువేనేట్ ఇన్ బౌండ్@2030 అనే అంశంపై జరిగిన మూడు రోజుల ఈవెంట్ లో అజయ్ జైన్ ప్రసంగించారు…రాష్ట్ర పర్యాటకానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను, ఏపీ పర్యాటకరంగానికి పారిశ్రామిక హోదా తదితర అంశాలను వివరించారు. పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్ ఉందని అజయ్ జైన్ వెల్లడించారు. పర్యాటకాభివృద్ధిలో టూర్ ఆపరేటర్ల పాత్రను వివరిస్తూ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి, పర్యాటకులకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మౌలిక సౌకర్యాల కల్పనలో, పర్యాటక ప్రాంతాలకు రాకపోకల విషయంలో కనెక్టివిటీ అంశంలో ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
Also Read:Heavy Rains : ఉత్తరాదిలో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు
ఈ క్రమంలో ఏపీలో నిర్మించ తలపెట్టిన కొత్త ఎయిర్ పోర్టుల గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఏపీ పర్యాటకాభివృద్ధికి పెద్దఎత్తున కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది విశాఖలో జరిగే ఐఏటీఓ సదస్సుకు ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలికారు. ఈవెంట్ లో భాగంగా వ్యాపార సెషన్ లు, ఇండియన్ టూరిజం ఫెయిర్ తదితర అంశాలపై చర్చ జరిగింది.
తాజావార్తలు
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!