టూరిజం ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ అనే వ్యక్తిని సుత్తితో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులు. అనంతరం చేతులు, కాళ్లు కట్టి గోనె సంచెలో కుక్కి అట్టపెట్టెలో ఫ్యాకింగ్ చేసి కారులో తరలించి భారకపేట అడవుల్లో పడేశారన్నారు. మృతుడు LB నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. ఏపీ టూరిజం, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో సూపర్‌వైజర్‌గా చంద్రశేఖర్ పని చేస్తున్నారు. చంద్రశేఖర్ వద్ద…
ఏపీలో బావికొండ బుద్ధిష్ట్ స్థావరాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు. త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తాo. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం కి మంచి అవకాశాలున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నం. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి…
శిల్పారామాల ద్వారా ఆదాయ సముపార్జనకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఏపీ టూరిజం. స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ అధ్యక్షతన జరిగిన శిల్పారామాల ఎగ్జిక్యూటీవ్ బాడీ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఆదాయ సముపార్జనకు ఖాళీగా ఉన్న శిల్పారామాల భూముల వినియోగానికి కసరత్తులు చేస్తున్నారు. శిల్పారామాల భూముల్లో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్సు కాంప్లెక్సుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ పద్ధతిలో గుంటూరు, కాకినాడ, కడప, అనంతపురంలో శిల్పారామాల్లో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్సు కాంపెక్సుల నిర్మాణాలకు ఎగ్జిక్యూటివ్…