Union Cabinet: ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రూ.1,332 కోట్లతో తిరుపతి – పాకాల – కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది.. తిరుపతి – పాకాల – కాట్పాడిల మధ్య మొత్తం 104 కిలో మీటర్ల మార్గంలో రూ.1,332 కోట్లతో డబ్లింగ్ పనులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది.. పీఎం గతిశక్తి పోర్టల్ ఆధారంగా రైల్వే నెట్‌వర్క్‌ను విశ్లేషించి అత్యంత రద్దీగా ఉండే ఈ సెక్షన్‌ను డబ్లింగ్ చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఈ డబ్లింగ్ పనుల వల్ల కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి ఉత్తర భారతదేశం వైపు వెళ్లే రైళ్లకు రద్దీ తగ్గుతుందని వెల్లడించారు.. అంతేకాదు.. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు, చంద్రగిరి కోటకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.. ఈ డబ్లింగ్ మార్గంలో మొత్తం 15 స్టేషన్లు, 17 పెద్ద వంతెనలు, 327 చిన్నవంతెనలు, 7 ఆర్‌వోబీలు, 30 ఆర్‌యూబీలు వస్తాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు..
Read Also: Rashi Khanna : బాలీవుడ్ సినిమాలు తీసే పద్ధతి మార్చుకోవాలి..
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు… టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ, రైలు-రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.. తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే లైన్‌ను డబుల్ ట్రాక్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.1,332 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి, రైల్వే శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. ఈ ప్రాజెక్టు నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.. ఈ లైన్ డబ్లింగ్‌తో ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుంది. అంతేకాదు, విద్యా, వైద్య అవసరాల కోసం వెల్లూరుకు వెళ్లే ప్రయాణికులకు ఇది గొప్ప వనరు కానుంది అని వెల్లడించారు.. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యం కావడం ద్వారా పరిశ్రమల వృద్ధికి ఇది తోడ్పడనుంది.. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ సిమెంట్ మరియు స్టీల్ రంగాలకు మరింత చేయూతనివ్వబోతుంది అన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..