ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. చాలామంది అక్కడ టికెట్ రేట్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ ఆంధ్రాలో భారీగానే నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు. మరోవైపు సినిమా పెద్దలు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు. దీంతో…
ఏపీలో థియేటర్ల రేట్ల విషయమై రచ్చ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్న టికెట్ రేట్లను టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరూ ఒక్కోలా పోల్చుతున్నారు. ఒకరు ఇంతకుముందు భారీగా పెరిగిన టమాటో ధరతో పోలిస్తే, మరొకరు తెలంగాణాలో ఉన్న థియేటర్ పార్కింగ్ ఫీజుతో పోల్చారు. మరోవైపు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాలూ కొని తెచ్చుకునే కన్నా థియేటర్లు క్లోజ్ చేసుకోవడం మంచిదని భావించి, క్లోజ్ చేశారు కూడా. అక్కడ అఖండ, పుష్ప వంటి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఎగ్జిబిషన్ పరిశ్రమ ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మహమ్మారి సమయంలో థియేటర్లు నెలల తరబడి మూతపడినప్పటి కంటే ఇప్పుడు పెరుగుతున్న ఈ నష్టాలు మరింత పెద్దవిగా భావిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. కనిష్ఠ టిక్కెట్ ధర థియేటర్ యజమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. జీవో 35కి వ్యతిరేకంగా కొందరు ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో, హైకోర్టు జిఓను రద్దు చేసింది. హైకోర్టు సూచనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే కొంతమంది ఎగ్జిబిటర్లు తమ…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలంటూ ప్రత్యేక జీవోను తెరపైకి తీసుకురావడం, దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది.…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. గత రెండు రోజుల నుంచి అన్ని భాషల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. కొన్ని ఫన్నీ మూమెంట్స్, మరికొన్ని సినిమా విశేషాలతో ప్రెస్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్‌ఆర్‌ఆర్”. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమా 2022 జనవరి 7న విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌కు చిత్రబృందం మొత్తం హాజరయ్యింది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో పలు విషయాలపై మేకర్స్…
సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ నిన్న మీడియాతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న టిక్కెట్ ధరల సమస్యపై ఆయన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్‌గారు పరిశ్రమకు సాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇది తీవ్రమైన సమస్య. ఇప్పుడున్న టిక్కెట్ ధరల సమస్యపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి. అఖండ పూర్తిగా బాలకృష్ణ స్టామినా. వైఎస్‌ఆర్ హయాంలో చిరంజీవి సినిమాకు ఇలాంటి సమస్య వచ్చింది. ప్రజల నుంచి చెడ్డపేరు వస్తుందని అధికారులు హెచ్చరించినా ఆయన టిక్కెట్ ధరలకు అనుమతి ఇచ్చారు.…
చిన్నా, పెద్ద వ్యత్యాసం లేకుండా సినిమాలన్నింటికీ టిక్కెట్ రేట్ ఫిక్స్‌డ్ గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయానికి లోలోపల రగిలిపోతున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకనిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు ఎవరూ ధిక్కారాన్ని వ్యక్తం చేయలేదు. ఎవరో కొంతమంది పరిశ్రమ సభ్యులు మాత్రమే నోరు విప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నటుడు సిద్ధార్థ్ చేరాడు. సిద్ధార్థ్ ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటాడు. తన మనసులో మాటను చెప్పడానికి వెనుకాడడు.…
టాలీవుడ్ లో గత కొన్ని నెలల నుంచి టికెట్ రేట్ల విషయమై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టికెట్ రేట్లను పెంచమంటూ సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం అక్కడ టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయం అలాగే నానుతోంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే గనుక టాలీవుడ్ కు భారీ నష్టం తప్పదనడంలో ఎలాంటి…