మంగళవారం పంపిణీదారులు, ప్రదర్శనదారులతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి తెలియచేశారు. చిత్రపరిశ్రమకు సబంధించిన పలు సంఘాల నుంచి తమకు విజ్ఞాపనలు వచ్చాయని, వాటన్నింటినీ ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించి సానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కూడా రేటు పెంచరా అని అడిగిన ప్రశ్నకు గత ప్రభుత్వంలా బామ్మర్దికి ఓ రూల్…
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టికెట్ల రేటు విషయమై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేటు తగ్గించిన తరుణంలో హీరో నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. థియటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణాకొట్టుకు ఎక్కువ ఆదాయం వస్తుంది అని నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నానితో పాటు హీరో సిద్దార్థ్ సైతం ట్విట్టర్ లో తన…
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గించడంపై నాని తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో ఐక్యత లేదు అని , వకీల్ సాబ్ సినిమా అప్పుడు మొదలైన ఈ సమస్యకు అప్పుడే పరిష్కారం వెతకాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. నాని వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు పెదవి…
ఏపీలో వరుసగా థియేటర్లు మూత పడుతున్నాయి. గత వారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలను తగ్గించడంతో ఎగ్జిబిటర్లు వ్యాపారంలో నిలబడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శ్యామ్ సింగ రాయ్, పుష్ప, అఖండ చిత్రాల ప్రదర్శనకు ఆంధ్రాలో తాజా పరిణామాలతో అంతరాయం ఏర్పడింది. కొన్ని థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తున్నారు. మరోవైపు చాలామంది థియేటర్ యజమానులు తక్కువ టికెట్ ధరలతో సినిమా హాళ్లను నడపలేము అంటూ…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఇష్యూ ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం.. ఈ విషయమై చిత్ర పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. “ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తుంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఏపీ ప్రభుత్వం…
ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు థియేటర్ల మూత పర్వం కొనసాగుతోంది. సినిమా థియేటర్లలో తనిఖీలు ఇంకా పూర్తవ్వలేదు. ఆంధ్రాలో శుక్రవారం 30 హాళ్లు సీజ్ అయినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్ని చోట్ల…
మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ శనివారం చేసిన ట్వీట్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. వీరు తమ తమ ట్వీట్స్ తో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఎపి గవర్నమెంట్ కు సందేశాలను పంపగలిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో పెద్ద రగడ జరుగుతోంది. జీవో 35ను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తే… కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జ్ తీర్పుతో దానిపై స్టే తీసుకు వచ్చారు. అయితే…
తెలంగాణాలో సినిమా టికెట్ ధరల పెంపుపై స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఉదయం చిరంజీవి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం నూటికి…
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు తగ్గించినందుకు టాలీవుడ్ హీరో నాని తన గొంతును విప్పి మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టికెట్స్ రేట్లను తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తున్నారు. థియేటర్ల కలెక్షన్ల కన్నా కిరాణా షాపు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని నాని అన్న మాటలకు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయమై స్పందించారు.…
ఏపీలో టికెట్ రేట్ల విషయమై ఎన్ని విమర్శలు వచ్చిన్నా ప్రభుత్వం ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ముందుకు సాగుతోంది. సినీ పెద్దలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని సాగదీస్తోంది. తెలంగాణాలో థియేటర్ల పార్కింగ్ ఫీజు కంటే ఆంధ్ర్రాలో టికెట్ రేట్లు తక్కువగా ఉండడం అక్కడి డిస్ట్రిబ్యూటర్లను కలవర పెడుతోంది. మరోవైపు ప్రభుత్వం మొండి వైఖరికి సెలెబ్రిటీలు సైతం విసిగిపోతున్నారు. దీంతో డైరెక్ట్ గానే ప్రభుత్వంపై కౌంటర్లు వేస్తున్నారు. నిన్న నాని తన సినిమా ‘శ్యామ్ సింగ…