ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఇష్యూ ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం.. ఈ విషయమై చిత్ర పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. “ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తుంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఏపీ ప్రభుత్వం చేస్తుంది తప్పు” అని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వంలో మంటలు చెలరేగాయి. నాని వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు తమదైన రీతిలో స్పందించారు. ఇక తాజాగా వాటినేమి పట్టించుకోని నాని మరోసారి ఈ విషయమై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
క్రిస్టమస్ కానుకగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని అస్సలు ఈ టికెట్ ఇష్యూ ఎప్పుడు మొదలయ్యిందో చెప్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ” అస్సలు టాలీవుడ్ లో సమస్య మొదలయ్యింది వకీల్ సాబ్ చిత్రంతో. అప్పుడే చిత్ర పరిశ్రమ అంతా ఏకం అయ్యి మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది. నిజం చెప్పాలంటే టాలీవుడ్ లో ఐక్యత లేదు.. అందరం ఒక థాటి మీదకు వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది.. అప్పుడే ఇది జరిగి ఉంటే .. ఈరోజు ఇక్కడి వరకు వచ్చేది కాదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. వకీల్ సాబ్ చిత్ర సమయంలో కానీ, రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ నోరు విప్పినప్పుడు కానీ చిత్ర పరిశ్రమ ఒక థాటిపై నిలిచి సపోర్ట్ చేసి ఉంటే ఇండస్ట్రీకి ఈ సమస్య వచ్చేదికాదని, అప్పుడు ఎవరి స్వార్థం వారు చూసుకున్నారు.. ఇప్పుడు ఒకరో ఇద్దరో నోరు విప్పితే సరిపోతుందా అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.