గెలిచిన నియోజకవర్గాన్ని.. గెలిపించిన ప్రజలను ఆయన మర్చిపోయారా? స్థానిక పార్టీ కేడర్‌కు ముఖం చాటేస్తున్నారా? ఏ విషయంలో కేడర్‌కు భరోసా లభించడం లేదు? పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతపై గుర్రుగా ఉన్నాయా? అచ్చెన్న అందుబాటులో లేరని కేడర్ ఆందోళనవైసీపీ గాలిలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరు టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడు ఒకరు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా. గత ఎన్నికల్లో టెక్కలి స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి గట్టి పట్టు ఉన్నా..…
ఆయన కేంద్ర మాజీ మంత్రి. అనువంశికంగా వచ్చిన హక్కులను పోరాడి సాధించుకున్నారు. హోదాతోపాటు ఇటీవల ఓ కారు కాంపౌండ్‌లోకి వచ్చింది. ఆ.. వాహనం ఎక్కాలంటేనే పెద్దాయన తెగ టెన్షన్ పడుతున్నారట. కోరి తెచ్చుకున్న ఆ కారు కష్టాలేంటో ఓ లుక్కేయండి. అశోక్ గజపతిరాజు. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా.. ప్రతి పక్షంలో వున్నప్పుడు సైలెంట్‌గా వ్యవహరించడం ఆయనకు అలవాటు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కాంట్రవర్సీకి ఆస్కారం వచ్చిన సందర్భాలు అరుదే. ఇదంతా 2020కి ముందుమాట కాగా ఇప్పుడు అశోక్…
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కుప్పంలో గెలిచామని సీఎం, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని… అది కూడా ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు, శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన మహిళలను…
ఏపీలో టీడీపీకి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయా? గవర్నర్ అపాయింట్‌మెంట్ పొందడంలోనూ ఆ పార్టీ విఫలం అవుతోందా? లోపం ఎక్కడుంది? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రణాళికలో లోపమా? మరేదైనా కారణమా? రాజకీయ పార్టీలు గవర్నర్‌తో భేటీ కావడం సాధారణం. ప్రభుత్వాలపై ఫిర్యాదు చేసేందుకు.. వివిధ విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాజ్‌భవన్‌కు వెళ్తుంటారు నాయకులు. గవర్నర్ వ్యవస్థపై టీడీపీకి మొదటినుంచి తీవ్ర అసంతృప్తి ఉన్నా.. ఆయా సందర్భాలలో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో…