ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ దాడి చేసిందని ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు చంద్రబాబు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం…