సీఎంగా మళ్లీ జగన్ ని చేస్తేనే భవిష్యత్ బాగుంటుందని వ్యాఖ్యనించారు. చారిత్రక అవసరం ఉంది.. అలా కాకుంటే దేశం కుడా క్షమించదు అని ఆయన పేర్కొన్నారు. సామాజిక సాధికార యాత్రనే కాదు స్వాభిమాన యాత్ర కూడా అని స్పీకర్ తమ్మినేని సీతారం చెప్పారు.
ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత మేనిఫెస్టో అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి హామీ మతగ్రంథంగా పవిత్రంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు పవిత్రమైనవిగా భావిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఆగస్టు నెలలో కెనడాలో జరిగే అంతర్జాతీయ స్పీకర్ల సదస్సుకు సంబంధించి శుక్రవారం నాడు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తనపై ఎప్పుడూ ఉండే విధానం ఉంటుందని.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం…
ఏపీ అసెంబ్లీలో సమావేశం అయింది ప్రివిలేజ్ కమిటీ (Privilege Commitee). కమిటీ ముందు హాజరయ్యారు టీడీపీ నేత కూన రవి కుమార్. ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. గతంలో స్పీకర్ పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్ పై విచారణ జరిపాం అనీ, గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పాం. అప్పుడు ఆయన రాలేదు. ఈరోజు వ్యక్తిగతంగా హాజరయ్యారని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు. కూన రవి కుమార్ చేసిన…
శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి ప్రాజెక్ట్‌ల పునరావాసంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంశధార ఆర్ఆర్‌కాలనీలో స్థలాల కేటాయింపులో చాలా దురాక్రమణలు జరిగాయని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌లో ముంపుకు గురైన ప్రాంతవాసులు గతంలో డబ్బులు తీసుకొని మళ్లీ భూములు కావాలనటం సరికాదని ఆయన వెల్లడించారు. అర్హులు, నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రజాప్రతినిధులు అక్రమణలు చేసి, పట్టాలు అమ్ముకోవడం చేస్తున్నారని, ఎక్వైరీ వెయ్యమని…
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాసారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఈ నెల 19వ తేదీన జరిగిన సభలో జరిగిన ప్రొసీడింగ్సును ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఇవ్వాలని లేఖలో కోరారు అనగాని. ఈనెల 19వ తేదీన శాసనసభలో జరిగిన చర్చను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఆడియో, వీడియోలను ప్రజల ముందు పెట్టాలి. గత రెండున్నరేళ్లుగా వ్యక్తిగత దూషణలు, విమర్శలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. స్త్రీ, పురుషులనే బేధం లేకుండా సభకు పరిచయం లేని…
మొన్నటి ఎన్నికల్లో ఆయన గెలవగానే మంత్రి అయిపోతారని అనుచరులంతా ఫిక్స్ అయిపోయారు. ఎన్నో లెక్కలేసుకున్నారు. కట్ చేస్తే ఊహించని విధంగా స్పీకర్ కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ ఆశ అలాగే ఉండిపోవడంతో… మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారట. రేసులో ఉన్నానని చెప్పడానికి సంకేతాలు పంపుతున్నారట. కేబినెట్‌లో చోటుకోసం మళ్లీ ఆశ! 2019 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తమ్మినేని సీతారామ్ చేసిన ప్రచారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కలిసి వచ్చింది. ఈ సీనియర్ పొలిటీషియన్‌కు సీఎం…
చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రభుత్వం అప్పులు చేస్తుందన్న విమర్శల పై కౌంటర్ అటాక్ చేశారు. లక్షల కోట్లు అప్పులు చేసి మా నెత్తిమీద పెట్టి హైదరాబాద్ లో కూర్చున్నావ్. జగన్ మీద విశ్వాసం ఉంది కాబట్టే బ్యాంకులు అప్పులిస్తున్నాయి. మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు జగన్ నానా కష్టాలు పడుతున్నారు. అగ్రిగోల్డ్ లో బోర్డు తిప్పేసిన ముసుగువీరులెవరో అందరికీ తెలుసు. నేనిప్పుడు ఆ పేర్లు చెబితే ఏడ్చి…