Andhra Pradesh: రాష్ట్రంలో 50 వేలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు 15 వేల రూపాయల వేతనం చెల్లించాలని సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఈ పెంపు కారణంగా ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. ఇందులో కొంత భాగాన్ని సీజీఎఫ్ నిధుల నుంచి చెల్లింపులు చేయాలని నిర్ణయించామన్నారు.…