ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు ఇవాళ తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయి.
Andhra Pradesh: రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త సబ్ డిస్ట్రిక్టులను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రీ-సర్వే అనంతరం పాలనా పరమైన వెసులుబాట్లు నిమిత్తం సబ్ డిస్ట్రిక్టులు ఏర్పాటు చేశారు.. పాలనా, పౌర సేవలు అందించంటంలో భాగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా జరిగేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఈ నిర్ణయానికి వచ్చింది.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. Read Also: Royal Tractor: బైక్…
రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి.. ఈ శాఖలో కొందరి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. 2018-19 సంత్సరానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లలో ఏది ముట్టుకున్నా.. దాని వెనుక ఏదో ఒక అక్రమం బయటపడుతోంది. మొన్నటి వరకు నకిలీ చలానాలు వ్యవహారం దుమారం రేపితే.. ఇప్పుడు ఏకంగా చలనాలే లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బయట పడింది.ప్రజల సౌకర్యాల కోసం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాలి.. ఇదీ ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసేందుకు తీసుకున్న ప్రయత్నాలు. అయితే కొందరు…