కొన్ని పచ్చ కుక్కలు అమాయకమైన కుక్కల్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నాయి. 2018 లో జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఒక వ్యక్తి కత్తితో హత్యాయత్నం చేశాడు.హత్యాయత్నం జరిగిన గంటకు అప్పటి డీజీపీ వచ్చి హత్యాయత్నం వెనుక ఎవరు లేరు..అతను వైసీపీ కార్యకర్త అని చెప్పారు.మరో గంటకు అప్పటి సీఎం చంద్రబాబు వాళ్లకు వాళ్లే చేయించుకున్నారని చెప్పారు.NIA కూడా హత్యాయత్నం జరిగింది అని చెప్పింది…కానీ కుట్రకోణం లేదని చెప్పింది.కేంద్ర ప్రభుత్వం సంస్థలు కూడా ఇంతలా మేనేజ్ చేయబడుతున్నాయి.
ఎన్టీఆర్ పై దాడి జరిగితే హత్యాయత్నం… జగన్ పై హత్యాయత్నం జరిగితే కోడి కత్తి కేసా?జగన్మోహన్ రెడ్డి కావాలని దాడి చేయించుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.2003 లో చంద్రబాబుకు జరిగింది ఏంటి?తన పై హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరపమని పిటిషన్ వేశారు.పిటిషన్ వేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదా?
Read Also: RCB vs DC: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 175 పరుగుల లక్ష్యం
చంద్రబాబుకి అన్నిచోట్ల స్లీపర్ సేల్స్ వున్నారు.సీబీఐ, NIA లో అధికారులను ప్రభావితం చేస్తున్నారు.విజయమ్మ, షర్మిళ, భారతమ్మ గురించి డీఎల్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతున్నారు.వైస్సార్ దగ్గర ఆషాడ భూతి లా బతికారు. NIA అధికారుల తీరుని ఖండిస్తున్నారు.చంద్రబాబు సొంత మనిషి శివాజీ తో గరుడపురాణం చెప్పించారు.చంద్రబాబు పై మాకు అనుమానం ఉంది.టీడీపీ నేతలు జగన్ పాలనను తుగ్లక్ పాలన అన్నారు…అంటే టీడీపీ నేతలు ముస్లింలను అవమానిచనట్లేనా?చంద్రబాబుకి కుక్క భాష వచ్చా?అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.