Perni Nani: జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు టీడీపీ నేతలకు పులివెందుల ఎన్నికలు కాంట్రాక్ట్ కి ఇచ్చినట్లు ఉన్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆడవాళ్ళ ఓట్లు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు వేసి వెళ్ళారు.. సిగ్గు, శరం లేకుండా బరితెగించి రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగల్లో కూడా పూలు, సైకిళ్ళు మాత్రమే.. గ్లాస్ వాళ్లను వదిలేసినట్లున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మంత్రి, రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ స్టేషన్ లోకి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు. మేం పత్తి వ్యాపారం చేయటానికి వెళ్ళమన్న డీఐజీకి వీళ్ల పత్తి వ్యాపారం కనిపించలేదా.. మంత్రి మనుషులు దాడులు చేసినా కేసులు ఎందుకు కట్టలేదు అని పేర్నినాని అడిగారు.
Read Also: Jammu & Kashmir Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. 12 మందికి పైగా..!
ఇక, ఎన్నికల కమిషన్ కు కళ్ళులేవా.. ఇవన్నీ కనిపించటం లేదా అని మాజీమంత్రి పేర్నినాని క్వశ్చన్ చేశారు. మంత్రి దగ్గరుండి పోలింగ్ ఏజెంట్లను బయటకు లాక్కెళ్లారు.. చిన్న చిన్న తప్పులకు కౌన్సిలింగ్ ఇచ్చే పోలీసులు తప్పులు చేస్తే కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా.. బరితెగించిన వాళ్లను వదిలేసి.. ఇంట్లో కూర్చున్న మా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు.. జిల్లా కలెక్టర్ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వీడియోలను ఎక్స్ లో పెట్టుకున్నారు.. అంత ధర్మబద్ధంగా ఎన్నికలు చేశామని ట్వీట్ చేసి ఎందుకు తీసేశారు.. ఆయన ముందే దొంగ ఓట్లు వేసింది అర్థమైంది కాబట్టే ట్వీట్ తొలగించారు.. మీరు ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారు.. డ్రామాను రక్తి కట్టించడానికి 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తున్నాం థాంక్స్ అనే స్లిప్పులు పెట్టారు.. దొంగ ఓట్లు వేయించేందుకు థాంక్స్ చెప్పారా అని పేర్నినాని ప్రశ్నించారు.
Read Also: ఇది ప్రజలు సాధించిన అద్బుత విజయం-B.Tech Ravi
అయితే, ఎవరు ఎవరికీ దండాలు పెట్టారు.. నారా లోకేష్ చేసిన ట్వీట్ లో కూడా ఇదే తరహాలో పెట్టారని పేర్నినాని అడిగారు. ఆయన పెట్టిన ట్వీట్ లో కూడా క్యూలో దొంగ ఓట్లు వేసే వ్యక్తి ఉన్నారు.. దొంగ ఓట్లు వేయించి పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని లోకేష్ బ్రతికించారట.. గతంలో మేం కుప్పంలో గెలిచిన సందర్భంలో మీలా మాకు మెజారిటీలు రాలేదు.. మావి గుద్దుకున్న ఓట్లు కాదు కదా అని ఎద్దేవా చేశారు. టీడీపీ వాళ్ళు 683 మంది వైసీపీకి ఓట్లు వేశారని గుర్తు చేశారు. మా వాళ్ళు ఓటింగ్ కు వెళ్లలేకపోయారు.. శత్రువు గుర్తుకు మీరు ఓట్లేశారు.. మీరు ఈ ఎన్నిక వల్ల ఏం సాధించారు.. 164 సీట్లతో ప్రభుత్వాన్ని పెట్టుకుని ఒక చనిపోయిన వ్యక్తి జెడ్పీటీసీ స్థానం కోసం పాకులాట ఎందుకు అని మాజీమంత్రి పేర్నినాని ప్రశ్నించారు.
Read Also: Nandamuri Balakrishna: పులివెందులలో టీడీపీ విజయంపై స్పందించిన బాలయ్య.. ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలో మీ ప్రభుత్వం 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు.. జగన్ నాయకత్వాన్ని తగ్గించగలిగారా అని వైసీపీ నేత పేర్నినాని క్వశ్చన్ చేశారు. ఆయన 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు.. మీకు స్వేచ్ఛగా ఎన్నికలు నడిపే ధైర్యం లేదు.. మీరు ఈ 14 నెలల కాలంలో ప్రజలకు మంచి చేసి ఉంటే భయం ఎందుకు.. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయించి ఉంటే ప్రజలు వాతలు పెట్టి ఉండేవారు.. ఇది ఎన్నిక కాదు.. ఇది ఎలక్షన్ కాదు.. మీకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు.. పోలీసులను అడ్డం పెట్టుకున్న బ్రిటీష్ రాజ్యం పతనం అయినట్లే మీ ప్రభుత్వం కూడా పతనం కావడం ఖాయం.. న్యాయపరంగా.. చట్టపరంగా మేం పోరాటం చేస్తాం.. గత ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే 12 శాతం అదనంగా ఓట్లు లెక్కించారు.. దాదాపు 48 లక్షల తేడా ఉంది.. మమ్మల్ని చూసి ఇవాళ చాలా మంది ఈవీఎంలపై మాట్లాడేందుకు బయటకు వస్తున్నారని పేర్నినాని వెల్లడించారు.