విశాఖలో శారదా పీఠం వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం సీఎం జగన్ విశాఖలో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా విశాఖ విమానాశ్రయం దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని పోలీసులను నిలదీశారు. ప్రజలకు అసౌకర్యం కల్గినందుకు చింతిస్తున్నానన్న జగన్.. దీనిపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. కాగా బుధవారం సీఎం జగన్ రాక సందర్భంగా పోలీసులు…
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వీఐపీలను బెదిరించే ముఠాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కన్నాభాయ్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సీఎంని చంపేస్తామంటూ ట్వీట్స్ చేసిన పవన్ ఫణి అరెస్ట్ అయ్యాడు.సైబర్ క్రైం ఎస్పీ రాధిక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మానవబాంబుగా మారి సీఎంను చంపేస్తానంటూ పోస్టింగులు చేశాడు. పవన్ ఫణి జనసేన మద్దతుదారుడని, ట్విట్టర్లో పోస్టులు పెట్టి…
తెలుగురాష్ట్రాల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాల కట్టడి/నియంత్రణకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అత్యాధునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మనిషి జీవితంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత విలువైందో అందరికీ తెలిసిన విషయమే. అదే తమకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది మోసగాళ్ళు అమాయకులను సాధారణ వ్యక్తి మొదలుకొని…
గుంటూరు జిల్లా నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి అరవింద్‌బాబుపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై ప్రశ్నించిన అరవింద్‍బాబు, ఇతర నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిదర్శనమన్నారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ…
మరోసారి ఏపీ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి నిరసనగా నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు పార్టీ కండువాలు వేసుకున్నారని మండిపడ్డారు.. వ్యవస్ధ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో వుండిపోయింది.. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దేందుకు కేంద్రం చూస్తోందని.. అందుకే రీకాల్ చేస్తారని చెప్పానని.. అది త్వరలోనే జరుగుతుందని…
ఏపీలోని పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందంటూ స్పష్టీకరణ చేసారు. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోంది. త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలి. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా…
ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్య జరిగింది. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లతో నివాసం ఉంటున్నారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి…
ఓమిక్రాన్ వేరింయట్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో, కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి కేంద్రం జారీ చేసిన పరిమితులు/మార్గదర్శకాల జాబితా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. మాస్క్ ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. సంస్థలు లేదా దుకాణాలు మాస్క్ లేని వ్యక్తిని తమ ప్రాంగణంలోకి అనుమతిస్తే పరిస్థితి తీవ్రతను…
అమరావతి రాజధాని రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వారి పాదయాత్ర నేటితో 31వ రోజుకు చేరగా.. ఈరోజు నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోకి రాజధాని రైతుల పాదయాత్ర ప్రవేశించగా… వారికి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈరోజు రైతుల పాదయాత్రలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కూడా పాల్గొన్నారు. Read Also: తిరుమల దర్శనాలను వాయిదా…
దేశ వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. ఇండియన్ పోలీస్ ఫౌండే షన్.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే-2021 విడుదల చేసింది. స్మార్ట్ పోలీ సింగ్ పై నివేదిక ఇచ్చింది. ప్రజలతో సంబంధాలు, సహకారం, సాంకేతికత, చట్టబద్ధత, అవినీతి అంశాలపై సర్వే నిర్వహించింది. 2014 డీజీపీల సమ్మేళనంలో స్మార్ట్ పోలిసింగ్ పద్ధతులను పాటించా లని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పిలుపునకు స్పందించి స్మార్ట్ పోలిసింగ్…