ఏపీలో కొత్త జిల్లాల విభజనపై తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని పదవులు అనుభవించిన చంద్రబాబు చేయని పనిని సీఎం జగన్ చేసి చూపించారన్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరిందన్నారు. ఎన్టీఆర్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు…
ఏపీలో జిల్లాల విభజనతో పలు జిల్లాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు వచ్చాయి. ఇదివరకు రాయలసీమలో 4, కోస్తాలో 9 జిల్లాలు అని సులభంగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పడం కష్టమైన పనే. ఈ విషయంపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. ఇదివరకు సముద్రతీరం ఉన్న గుంటూరు జిల్లాలో జిల్లాల…