ఏపీలో ఇప్పటికే ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్ సర్కార్ సతమతమవుతుంటే ఏపీ వైద్యాఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్ పేల్చారు. జగన్ సర్కార్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది తెలిపింది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు దశల వారి ఉద్యమానికి ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ( హంస) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపీ…