ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పాలసీలు సిద్ధం చేశారు.. అలాగే వాటిని అవలంభించడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా సిద్ధం చేశారు.. గత ప్రభుత్వం పాలసీలు చేసి గైడ్ లైన్స్ ఇవ్వకుండా వదిలేసిన వాటికి సైతం గైడ్ లైన్స్ ఇచ్చారు... యువ పారిశ్రామికవేత్తలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మూడు ప్రధాన పాలసీలను రూపొందించారు.. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ప్రధాన టార్గెట్ గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రులకు దిశానిర్దేశం చేసిన విషయం విదితమే…