AP Industrial Policies: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పాలసీలు సిద్ధం చేశారు.. అలాగే వాటిని అవలంభించడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా సిద్ధం చేశారు.. గత ప్రభుత్వం పాలసీలు చేసి గైడ్ లైన్స్ ఇవ్వకుండా వదిలేసిన వాటికి సైతం గైడ్ లైన్స్ ఇచ్చారు… యువ పారిశ్రామికవేత్తలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మూడు ప్రధాన పాలసీలను రూపొందించారు.. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ప్రధాన టార్గెట్ గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రులకు దిశానిర్దేశం చేసిన విషయం విదితమే కాగా.. దీనిలో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీలను తయారు చేసారు… వాటిలో మూడు పాలసీలను మంత్రులు ఆవిష్కరించారు.. ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలు ఆవిష్కరించారు.. వాటికి గైడ్ లైన్స్ సైతం ఆవిష్కరించారు మంత్రులు… గత ప్రభుత్వం లో ఏపీకి రాకుండా పోయిన పరిశ్రమలని తీసుకొచ్చేలా పాలసీలు చేస్తున్నారు.
Read Also: Balakrishna: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్
ప్రతీ జిల్లాకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడం, అలాగే మండలానికి ఒక చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేయడం లక్ష్యాలుగా నిర్షయించారు.. పరిశ్రమలలో పెట్టుబడి పెట్టడమే కాకుండా ఇచ్చే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ఇన్సెంటివ్ లు ఇవ్వాలని నిర్ణయించారు.. అలాగే గత ప్రభుత్వం లో ఇన్సెంటివ్ లు పొందని వారి వినతులు కూడా పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం, అవి కూడా పరిష్కరించాలని నిర్ణయించారు… P3, P4 మోడళ్లలో పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు చేసారు.. ఎస్సీ, ఎస్టీలకు P3 మోడల్ లో అవకాశాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.. టెక్నికల్ డెవలప్మెంట్ లో భాగంగా AI వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు… ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ల వారీగా పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నారు.. భూముల కేటాయింపుకు కూడా తగిన పాలసీ, లాజిస్టిక్స్ పాలసీ సైతం రూపొందిస్తున్నారు.. ఏదేమైనా.. ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకురావడం, గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం తథ్యం అని ప్రభుత్వం చెపుతోంది.
Read Also: Chirutha Back Story: సాయి రామ్ శంకర్ మిస్సైన ‘చిరుత’ చరణ్ చేతికి.. అసలు కథ ఇదా!
ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పాలసీలు, వాటికి గైడ్ లైన్స్ ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించింది.. వాటి ద్వారా స్టార్టప్ లకు, యువ పారిశ్రామికవేత్తలకు, మహిళలకు అవకాశాలు ఇచ్చేలా పాలసి రూపొందించారు.. అలాగే లాజిస్టిక్స్ కు సంబంధించిన కొత్త పాలసీ సైతం సిద్ధం చేస్తున్నారు.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసి, MSME & పారిశ్రామిక వేత్తల అభివృద్ధి పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ… మంత్రులు టి.జి.భరత్, కొండపల్లి శ్రీనివాస్ లు ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పాలసీలు ఇచ్చింది.. కానీ గైడ్ లైన్స్ ఇవ్వలేదు… అవి కూడా మేమే ఇస్తున్నాం.. పాలసీలు ఎలా వినియోగించుకోవాలో అనేది గైడ్ లైన్స్ ద్వారానే తెలుస్తుంది.. ఉద్యోగాలు ఎన్ని ఇస్తారో అనే దానిపైన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఉంటుంది.. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కి ఈ పాలసీలు, గైడ్ లైన్స్ ఉపయోగపడతాయి అన్నారు.. ఈ పాలసీలు, గైడ్ లైన్స్ ద్వారానే పరిశ్రమలు ఏర్పడతాయి.. మే 15 నుంచీ ఎస్క్రో అకౌంట్ విధానం ఆవిష్కరిస్తున్నాం.. విధాన పరమైన అంశాలు పూర్తి చేస్తే ఇన్సెంటివ్ లు డైరెక్టుగా వచ్చేస్తాయి.. వచ్చే నెల నుంచి 3 వేల నుంచి 5 వేల కోట్ల వరకూ ఇన్సెంటివ్స్ ఇస్తాం.. SIPC, SIPB, కేబినెట్ లో క్లియర్ అయిన దాని ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెపుతున్నాం.. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని మంత్రుల సమావేశంలో చెప్పారని తెలిపారు టీజీ భరత్..
Read Also: Kidney Health: ఈ పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చుకోవాల్సిందే!
ఇక, పార్క్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ పాలసీ, కొన్ని ప్రధాన పోర్టళ్ళు ఇవాళ ఆవిష్కరించాం అని వెల్లడించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి అనే దానిపై సీఎం ఎన్నో నిర్దేశాలు చేసారు.. ఇండస్ట్రియల్ పార్టనర్ లు అందరితో చర్చించిన తరువాత పాలసీలు చేసాం.. P4 మోడల్ అనేది దేశంలో ఎక్కడా లేదు… ఇండస్ట్రియల్ పార్క్ లు P4 విధానంలో అభివృద్ధి చేస్తాం.. ఇండస్ట్రియలిస్టులు, అన్ని అసోసియేషన్ ల ముందు పాలసీలు, గైడ్ లైన్స్ ఆవిష్కరించాం.. సీఎం మాకు చాలా సమయం ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో పరిపాలన అంశాలలో చాలా లోపాలు జరిగాయి.. ఇప్పుడు యువ వ్యాపారవేత్తలను తీసుకురావడానికి ప్రధాన దృష్టి పెట్టాం.. ఒకొక్క జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ పార్క్, మండలానికి ఒక చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. ఇప్పటికే ఉన్న పరిశ్రమలలో ఉన్న ఇబ్బందులు కూడా సరి చేసేలా పాలసీ చేశామని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్..