రాబోయే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గెలుపు ఉండబోతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ 'ఫ్యామిలీ డాక్టర్' విధానాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.