Employee Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపై కసరత్తు కొనసాగుతుంది. విద్య, వైద్య శాఖలు మినహా 15శాఖల్లో బదిలీలు కొనసాగనున్నాయి. పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Polavaram Project Files: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కలకలం రేపుతుంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి కార్యాలయంలో ఘటన చోటు చేసుకుంది.
Employees Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ తప్పని సరి చేసింది సర్కార్..
Satyakumar: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిటింగ్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శానిటేషన్, ఆస్పత్రుల నిర్వహణ, ఎక్విప్మెంట్, డయాలసిస్ కేంద్రాలు లాంటి వాటిపై ఆడిటింగ్ చేపడతామన్నారు.
Jogi Ramesh: మంగళగిరిలో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసు విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో తిట్టారు.. అందుకే నేను చంద్రబాబు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయాలని వెళ్లాను.. నిరసన తెలుపుతున్న నాపై దాడి చేసారు.
రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్ భేటీ కానున్నారు. సీఎం నివాసంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో సీఐఐ ప్రతినిధుల బృందం మీట్ కాబోతున్నారు.
Minister Narayana: రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతులతో అన్న క్యాంటిన్ లను ప్రారంభిస్తారు అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు నిర్వహించాం.
Nallari Kiran Kumar Reddy: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లు సీఎం చంద్రబాబుకు పెను సవాల్ అన్నారు.
CM Chandrababu: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.