ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ రోజు మరిన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం.. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సమీక్షించనున్న ఆయన.. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించనున్నారు.. గిరిజన హాస్టళ్లల్లోని పరిస్థితులపై ఆరా తీయనున్న ఏపీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా…
మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పరిపాలనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.. కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయిని వదలకుండా పూర్తి స్థాయిలో కేంద్ర పథకాలను అధ్యయనం చేయాలని వెల్లడించారు ముఖ్యమంత్రి.. మూసధోరణిలో కాకుండా వినూత్నంగా ఆలోచన చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులకు కష్టాలు తప్పడం లేదు.. గత నెలలో గ్రామ/వార్డు సచివాలయ దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. మే 1వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఈ రోజు, రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.. ఇక, ఆన్‌లైన్ లేనివారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు..
Fake GO: సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత రియల్ ఏదో.. వైరల్ ఏంటో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.. సున్నిత అంశాలపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టి వైరల్ చేయడమేకాదు.. ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు.. కొన్ని సార్లు కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా డమ్మీవి తయారు చేసి.. ఉద్యోగులను గందరగోళంలోకి నెడుతున్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ జీవో కలకలం రేపుతోంది.. ఫేక్ జీవోను సోషల్…
ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇక, అన్ని విభాగాలు, అన్ని కేటగిరీల ఉద్యోగులకు కూడా ఇక నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నుంచి హెచ్‌వోడీ కార్యాలయాలు, సెక్రటేరియట్ సిబ్బంది వరకు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకోనున్నారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఇదే విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు.. ముందుగా.. సెక్రటేరియట్,…
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి.. అని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే…
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు చేరింది.. వరద ఉదృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.. భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అయితే, వరదలకు…