Sake Bharathi : కష్టాలు ఎదురైనా లక్ష్యం చేరుకుంటే ఎలా ఉంటుందో డాక్టర్ సాకే భారత్ జీవితం చెబుతుంది.. ఓవైపు కటిక పేదరికం.. మరో వైపు ఉన్నతాశయం.. ఎంతో కష్టపడి కూలి పనులు చేసుకుంటూ చదువుకుని పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె కష్టం వృథా కాలేదు.. పీహెచ్‌డీ చేసేంత వరకు ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు చూడాల్సి వచ్చింది.. కానీ, ఆ పీహెచ్‌డీ సాధించిన తర్వాత.. ఎంతో మంది ప్రశంసలు అందుకుంది.. తెలుగు రాష్ట్రాలు మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది.. ఎవరా? సాకే భారత్.. ఆమె జీవితం ఏంటి? జీవనం ఏంటి? ఎలా పీహెచ్‌డీ సాధించింది అనే విషయాల్లో అన్ని మీడియాల్లో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి.. అయితే, తక్కువ కాలంలోనే ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది.. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ సాధించిన సాకే భారతి టాలెంట్‌ను గుర్తించిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఆమెకు సాయం చేసి అండగా నిలిచింది. సాకే భారతికి 2 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం.. ఆ రెండు ఎకరాల భూమికి సంబంధించిన పట్టాను సాకే భారతికి అందించారు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి.
Read Also: Gold Today Rate: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
సోమవారం రోజు కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సాకే భారతికి పొలం పట్టా అందజేసిన కలెక్టర్ గౌతమి.. భారతి సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన భారతి.. ఎందరికో ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు.. భారతికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని ప్రకటించారు కలెక్టర్ గౌతమి.. శింగనమల మండలం సోదనపల్లి గ్రామంలో సర్వే నంబరు 9-12లో వ్యవసాయ యోగ్యమైన 2 ఎకరాల భూమి భారతికి అందించాం. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తామని.. ఎస్‌కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది.. సాకే భారతి అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో కూలిపనులు చేసుకుంటూనే కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన సాకే భారతి జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన విషయం విదితమే.. పేదరికాన్ని జయించి మరీ ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు డాక్టర్ సాకే భారతి..