Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగుల సంఘాల సమావేశం ముగిసింది.. అయితే, ఈ సారి కూడా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.. దీంతో, యథావిథిగా తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎస్‌తో సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్ కార్డ్‌లు, 11వ వేతన సంఘం అంశాలపై చర్చించాం.. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కావాలని అడిగాం.. వీటిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని…
పీఆర్సీ ఉద్యమం ఉధృతమైంది.. సమ్మెకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇప్పటికే పెన్ డౌన్ అంటూ.. ఆందోళనను ఉధృతం చేశారు.. అయితే, ఉద్యోగ సంఘాల నేతల తీరుపై సీరియస్ గా స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మాటలు, వాటికి కౌంటర్లు చేస్తూ వెళితే అసలు సమస్య డైవర్ట్ అవుతుందని.. దీని వల్ల ఉద్యోగులకే నష్టం అన్నారు.. ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదన్న ఆయన.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత…