Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగుల సంఘాల సమావేశం ముగిసింది.. అయితే, ఈ సారి కూడా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.. దీంతో, యథావిథిగా తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎస్‌తో సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్ కార్డ్‌లు, 11వ వేతన సంఘం అంశాలపై చర్చించాం.. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కావాలని అడిగాం.. వీటిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.. కానీ, పే స్కేల్ విషయంలో స్పష్టత రాలేదన్నారు.. వైద్యారోగ్య శాఖ రేషనలైజేషన్ లో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం.. గత సమావేశంలో ఇతర సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు చేసినట్టు చెప్పారు.. ఏపీ జీఎల్ఐ గత ఆరు నెలలుగా క్రెడిట్ కాలేదని చెప్పామని తెలిపారు సూర్య నారాయణ.
Read Also: Manoj Sinha: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదు.. జమ్మూకశ్మీర్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ఇక, హెల్త్ కార్డ్‌కు ఉద్యోగి వాటా చెల్లించినా ఉపయోగం లేదన్నారు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్.. 104 టోల్ ఫ్రీ నంబర్ అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు.. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కావాలని అడిగినట్టు తెలిపారు.. మరోవైపు ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చీఫ్ సెక్రటరీ ఇతర ఉన్నతాధికారులతో చర్చ జరిగింది.. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులలో అనేక ఇబ్బందులు ఉన్నాయని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.. పీఆర్‌సీ అరియర్స్ ఇంకా లెక్క కట్టలేదు అని చెప్పారు. పీఆర్‌సీ కమిషన్ రికమెండ్ చేసిన పే స్కేల్స్ ఇవ్వలేదు. కరెస్పాండెన్స్ పే స్కేల్స్ ఇస్తున్నారు.. పలు అంశాలపై అవగాహనకు మాత్రమే ఈ మీటింగ్ పెట్టారని.. డీఏ అరియర్స్, పీఆర్‌సి అరియార్స్ ను వేరుగా చూడాలి.. మా ఉద్యమం యథావిథిగా కొనసాగుతుంది.. వచ్చే నెల 5వ తేదీన మరో సారి సమావేశం అయ్యి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు .