144 Section in Palnadu: రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్…
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో.. మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతే.. జిల్లాలో రేపు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం అయిందని తెలిపారు. మరోవైపు.. పోలింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.…
సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో పోలింగ్ వేళలను ఈసీ ప్రకటించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అరకు, పద్రో, రంపకుడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సరూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. క్యూలో…
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలో.. ప్రతీ ఇంటికి, ప్రతీ గడపకు వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాగా.. కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ ప్రచారం నిర్వహించారు. కైకలూరు మండలం వెలమపేటలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు.
చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో ప్రజలంతా ఒకే నిర్ణయం తీసుకొని.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమంటూ.. గ్రామస్తులు.. ఊరంతా వేసిన గోడపత్రాలు.. ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి.
సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సహా జనసేన తెలుగుదేశం బిజెపి కోటపై పోటీ చేస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం జనసేనని గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఏపీలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కోసం ఈరోజు ఉదయం నుంచి సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఉదయాన్నే మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేసి ఈసారి జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆ తర్వాత హీరోలు నాని, రాజ్ తరుణ్ కూడా పవన్ కళ్యాణ్ కి…
ఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం.ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు .గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగంగా సపోర్ట్ చేయలేదు .ఈ సారి టాలీవుడ్…