తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే డీఎస్సీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ విద్యశాఖ. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ విషయంపై గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మరోసారి రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ వెబ్సైట్లో…
ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త చెబుతూ.. ఇప్పటికే ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.. మొత్తం 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు రిలీజ్ చేశారు.. మొత్తం 6,100 పోస్టుల్లో ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.