పిఠాపురం మహారాజా వారసులకు చెందిన ఆస్తుల కబ్జాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే విచారణ చేయాలని కలెక్టర్, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. వివాదంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆర్డీవో కిషోర్ విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని.. ఈ ఆస్తికి సంబంధించి వివాదం కోర్టు పరిధిలో ఉందని.. ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీ చంద్రలేఖ కుటుంబానికి చెందినదని.. శాఖా పరంగా విచారణ…
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు అభినందనలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
రేపట్నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కలిశారు. ఏపీ, తెలంగాణ,పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు పవన్‌ను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను డెప్యూటీ సీఎంకు వివరించారు. క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలు అందించొద్దని వినతి పత్రాన్ని అందించారు.
Tollywood Producers Meeting With AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు టాలీవుడ్ బడా నిర్మాతలు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లయిట్లో గన్నవరం బయల్దేరారు. సోమవారం కేబినెట్ సమావేశం తరువాత డిప్యూటీ సీఎంను నిర్మాతలు కలిసే అవకాశం ఉంది. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ ఉండబోతోంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు నిర్మాతలు వివరించనున్నారు. Also Read: Gold…