మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి, మరాఠా పరాక్రమానికి చిహ్నంగా, సనాతన ధర్మ రక్షకునిగా నిలుస్తుందన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, నాయకత్వ వారసత్వంతో తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ పుణ్యభూమిని సందర్శించడం గర్వకారణంగా ఉందన్నారు.
మహారాష్ట్ర బల్లార్పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలన్నారు. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు. శివాజీ మహరాజ్ భూమి ఐన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు.
ఈ రోజు మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో మొదట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతంగా చెప్పుకొచ్చారు.. బాలా సాహెబ్ ఠాక్రే (బాల్ ఠాక్రే) నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను.. శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దని.. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.
ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చింది.. పవన్ చొరవతో రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం తెలిపారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల.. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇక, పలీనా అంజని మైనర్ కావడంతో.. ఆమె తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియజేశారు.
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఎక్స్(ట్విట్టర్) వేదికగా పవన్ కల్యాణ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు చేస్తానన్న సాయం కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు.
హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు.. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..