పార్వతీపురం మన్యం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం చేశారు. 12 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు కేటుగాళ్లు.. దీంతో, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన బాధితురాలు శ్రీలక్ష్మి లబోదిమోమంటోంది..
వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని నుంచి అందినకాడికి అనే తరహాలో.. కోట్లాది రూపాయలు మోసాలు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు.
కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కూతురు అత్త గారింట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి శాడిస్ట్ భర్తతో వేధింపులు మొదలయ్యాయి. ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన వధువుకు అనుక్షణం అవమానాలే ఎదురయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త విచక్షణ మరచి నువ్వు అందంగా లేవు. నాకు పరిచయం ఉన్న సాయి అనే అమ్మాయి అందం ముందు నీవెందుకు పనికిరావు అంటూ కొట్టి దూషించడం, అడ్డు చెప్పాల్సిన అత్తామామ అతనికి అండగా నిలబడటం చూసి తట్టుకోలేకపోయింది.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొంత మంది వివాహేతర సంబంధాల కోసం హత్యలకు తెగబడుతుంటే.. ఇంకొందరు కుటుంబ కలహాలతో జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్నారు.
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ.. ఎలా.. ఏ ప్లాన్‌తో డబ్బులు కొట్టేస్తారో కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడు, చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఓ భారీ మోసం చూస్తే.. అతడి కన్నింగ్ ఐడియా చూసి అంతా నోరువెల్లబెడుతున్నారు.. పెళ్లి పేరుతో ఏకంగా 28 కోట్ల రూపాయలు కొట్టేశాడో కేటుగాడు.
ఆదోనీలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పత్తికొండ గురుకుల స్కూల్ లో ఇంటర్ చదువుతున్న బాలిక.. వైద్యం నిమిత్తం తన తల్లితోపాటు సొంతూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చింది.. అయితే, పొరపాటున ఆదోనీ బస్సు ఎక్కిందట బాలిక.. ఇక, చేసేది ఏమీ లేక .. ఎమ్మిగనూరు బస్సు కోసం ఆదోనీ బస్టాండ్ లో ఎదురు చూస్తుండగా కన్నేసిన ఆటో డ్రైవర్ రమేష్..
కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. కాలు నరికి బైక్ లో తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్ పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.
నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నంద్యాల శివారు కర్నూలు బై పాస్ రోడ్డులోని ఎల్.కే. ఆర్. ఫంక్షన్ హల్ వద్ద హత్య జరిగింది. ఆటో డ్రైవర్ వినయ్ కుమార్ అలియాస్ మోతిని మిత్రులే రాళ్లతో కొట్టి చంపేశారు. వినయ్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ దావత్లో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.