ఏపీలో భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి నియామకం కాగా.. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రస్తుత గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఆదేశాలు జారీ అయ్యాయి.
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.