విజయవాడలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకున్నా నేపథ్యంలో రాళ్ళ దాడి కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేసారు పోలీసులు. రోడ్ షోలో జగన్‌ని చూసేందుకు, స్వాగతం పలికేందుకు వచ్చిన భారీ జన సందోహంలో ఎవరో గుర్తుతెలియని ఆగంతకులు జగన్ వాహనం వైపు రాళ్లు వేశారు. ఆగంతకుడు విసిరాయి సీఎం జగన్ నదుటిపైన, అలాగే ఎడమ కంటి కింద గాయమైంది. Also Read: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్..…
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు అని తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం.. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34, 288 కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ కార్డులో క్యూ ఆర్ కోడ్, లద్ధిదారుని ఫోటో, లబ్ధిదారుని ఆరోగ్య వివరాలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
నేటి నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది ఏపీ సర్కారు. ఇవాళ్టి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వచ్చి కుర్చుంటానంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖను రాజధానిగా డిక్లైర్ చేసే అవకాశం, అధికారం ఎవరికీ లేదు అని ఆయన వ్యాఖ్యనించారు.
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. అయితే, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం చేపడతారు. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకోనున్నారు.
కృష్ణాజలాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రం తాజా విధివిధానాల జారీ నేపథ్యంలో ఈ మీటింగ్ జరిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో సీఎం జగన్ భేటీ అయ్యారు.