తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేటి ఉదయం ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఇప్పటికీ పెండింగులోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
MEGA DSC 2024 : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తును చేస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా…
AP CM Chandrababu Naidu Reach Kuppam: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ రెండు రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. మంగళవారం హంద్రీ-నీవా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు,…
AP CM Chandrababu Naidu Tour Today: రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారట. తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు…
Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు (chandra babu) రాష్ట్ర అధికారులకు ఆదేశం ఇచ్చారు. చీరాల మహిళ హత్య గంజాయి మత్తులో నేరం జరగడం పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ హత్య కేసును స్వయంగా ఆయనే పర్యవేక్షించారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్ జరిగేంత వరకు కేసు పురోగతిపై నిత్యం ఆరా తీస్తూనే ఉంటానన్నారు సీఎం చంద్రబాబు. చీరాల మహిళ హత్య కేసులో నిందితులను 48…
Kalavedika Ntr Film Awards : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి. తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలోని అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన కళాకారులకు ” కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ” 29 జూన్ 2024 నాడు హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగుతుంది. కళావేదిక (R.V.రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
సీఎం జగన్ విదేశాలకు వెళ్ళే సమయంలో ఎయిర్ పోర్ట్ లో అనుమానాస్పదంగా సంచరించిన డాక్టర్ లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గుండె పోటనడంతో పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.