వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పలువురు దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు తమ వంతు సాయంగా విరాళంగా అందించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో స్పందించితన దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు ఈరోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన దాతలను అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.
విజయవాడ సహా ఏపీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. ఇక, కృష్ణానది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. మరోవైపు.. ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమ తమ వంతు సాయం చేస్తూ ఉంటుంది.. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు టాలీవుడ్ మొత్తం ఒక్కటిగా వారికోసం నిలబడతారు..ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వరదల కారణంగా ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలు వరద ధాటికి కొట్టుకుపోయాయి.ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. ప్రభుత్వానికి…
గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం పలువురు తమవంతు సాయం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆపన్న హస్తం అందించింది. వరద బాధితుల సహాయార్థం 10 లక్షలు.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్విట్టర్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విఐటి-ఏపీ విశ్వవిద్యాలయం 50 లక్షల విరాళం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని విఐటి ఫౌండర్ & ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ కలిశారు . ఈ సందర్బంగా విఐటి విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ అత్యంత ప్రతిష్ట్మాకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గుర్తింపు పొందిందని మరియు విఐటి-ఏపీ విశ్వవిద్యాలయ పురోగతిని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి మొదటి విడతలో 25…