అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (NGT) తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి నిపుణులతో కమిటీ వేయాలని ప్రతిపాదించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టొద్దని సూచించింది. Also Read: ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే జగన్ నాశనం చేస్తున్నాడు: నిమ్మల రామనాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం పై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయాలని, ఈ కమిటీ నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ విస్తరణకు ఇంకా అవకాశం ఉందా లేదా అన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి.కాగా ఇప్పట్లో ఏపీ క్యాబినేట్ విస్తరణ ఉండకపోవచ్చనే సమాధానం మాత్రం వస్తుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో విస్తరించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని గతంలో జగన్ చెప్పినా మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశం లేకపోలేదు. అటు విస్తరణలో అందర్ని మారిస్తే వారు శాఖలపై పట్టు సాధించేలోపు ఎన్నికలు వస్తాయని జగన్ ఆలోచిస్తున్నారు. 7-8 మందితో…
ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని కోరింది సీబీఐ. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు సీబీఐ. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో హైకోర్టు నిరాకరించిందని సీబీఐ వాదించింది. జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం వుందని సీబీఐ తన వాదనల్లో పేర్కొంది. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని తెలిపింది.…
బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శన, ఆన్ లైన్ టికెటింగ్ గురించిన సవరణలను మంత్రి పేర్ని నాని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సినిమా రంగంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ ఈ విషయమై గట్టిగా స్పందించిన పవన్ కళ్యాణ్, ఈ సారి తమ పార్టీ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా తమ నిర్ణయాన్ని తెలిపారు. ”పోరాడండి !! ప్రాధేయ పడకండి !! ఇది మీ హక్కు !! ప్రభుత్వం…
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్ల తెలుస్తోంది. ఏపీ శాసన మండలి రద్దు చేస్తున్నట్లు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనుంది. గతంలో సంవత్సరం జనవరిలో శాసన మండలిని రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ తీర్మానానికి 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హజరుకాకపోవడంతో ఈ తీర్మానంపై వ్యతిరేకంగా ఓట్లు రాలేదు. దీంతో ఆ రోజు…
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలి వివాహం ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్, కేసీఆర్ ఇద్దరూ ముచ్చటించుకున్నారు. అయితే ఏపీలో ఓ పక్క వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుకావడంపై టీడీపీ నేత లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే సీఎం జగన్ పెళ్లికి హాజరుఉ కావడమేంటని లోకేష్…
ఏపీలోని వరద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వరద ప్రభావిత జిల్లాలలో నిత్యావసర సరకుల పంపిణీకి ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు వేధిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే వుంది. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా అరికట్టే పనిలో నిమగ్నం అయ్యారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో…
రాజకీయాలంటే వేడిగానే వుంటాయి. అందునా తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, విపక్షాల మధ్య అయితే ఇది మరీ వేడిగా వుంటుంది. ఏపీ తెలంగాణ మధ్య తాజాగా మాటల దాడి వేడిని పుట్టిస్తోంది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుని బ్రతకాల్సి వస్తుందని ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని… కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద…
ఏపీ సీఎం జగన్ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఉదయం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా సెప్టెంబర్ 24వ తేదీన సీఎం జగన్ వ్యాయామం చేస్తూ గాయపడ్డారు. జిమ్ చేస్తుండగా ఆయన కాలు బెనకడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో వైద్యులు సాధారణ ట్రీట్‌మెంట్ ఇవ్వగా…