ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శన, ఆన్ లైన్ టికెటింగ్ గురించిన సవరణలను మంత్రి పేర్ని నాని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సినిమా రంగంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ ఈ విషయమై గట్టిగా స్పందించిన పవన్ కళ్యాణ్, ఈ సారి తమ పార్టీ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా తమ నిర్ణయాన్ని తెలిపారు. ”పోరాడండి !! ప్రాధేయ పడకండి !! ఇది మీ హక్కు !! ప్రభుత్వం నిర్ణయించడానికి ఇది నిత్యావసర వస్తువు కాదు. పిరికితనం వదిలేయండి. పోరాడితే పోయేదేమీ లేదు” అంటూ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ట్వీట్ చేసింది.
Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి
Also Read
ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాల్సిందిగా కోరారు. ”పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం, తగ్గించిన టికెట్స్ రేట్స్ ను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే మేలు జరుగుతుంది” అని ఓ ప్రకటనలో తెలిపారు. అలానే ‘దేశమంతా ఒకే జీఎస్టీగా టాక్స్ లను ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసమని, దయచేసి ఈ విషయమై పునరాలోచించమని, ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకో గలుగుతుంద’ని చిరంజీవి ఎ.పి. సి.ఎం. జగన్ ఉద్దేశించి ఈ ప్రకటనలో పేర్కొన్నారు. పారదర్శకంగా టిక్కెట్లను ప్రభుత్వమే విక్రయిస్తున్నప్పుడు ఇక షోస్ ను నియంత్రించడం, టిక్కెట్ రేట్లను తగ్గించడం ఎందుకనే ప్రశ్న చాలా మంది బయ్యర్లు వేస్తున్నారు. మరి అధికారంలో ఉన్న పెద్దలు ఈ విషయాలపై పునరాలోచన చేస్తారో లేదో చూడాలి.
Appeal to Hon’ble @AndhraPradeshCM
Sri.@ysjagan pic.twitter.com/zqLzFX8hCh— Chiranjeevi Konidela (@KChiruTweets) November 25, 2021
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?