ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం మధ్యాహ్నం నాడు వైద్యశాఖ అధికారులతో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అదే సమయానికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్…
ఏపీలో థియేటర్లు మూసివేస్తుండటంపై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ సక్సెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో టిక్కెట్ రేట్ల వల్ల మూతపడ్డ అన్ని సినిమా థియేటర్లు తెరుచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు మూసివేయడం బాధాకరమన్నారు. సినిమా థియేటర్లు మూసివేయవద్దని యజమానులు, నిర్మాతలను ఆయన కోరారు. Read…
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. కోర్టుకు వ్యక్తిగత హాజరు నేటికి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రతీ విచారణకు మినహాయింపు కోరుతున్నారని సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది సీబీఐ కోర్టు. కోర్టుకు రాకుండా హాజరు మినహాయింపుపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామన్నారు జగన్ తరఫు న్యాయవాది. హాజరు మినహాయింపుపై హైకోర్టులో తీర్పు రావల్సి ఉందని న్యాయవాది తెలిపారు. హైకోర్టు తీర్పు…
ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ విషెస్ తెలియజేశారు. జగన్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నేతలకు, పవన్ కళ్యాణ్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో పవన్ స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ సీఎం జగన్‌కు…
ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే జగన్’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సీఎం జగన్‌కు విషెస్ చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ట్వీట్‌కు విశేష స్పందన లభిస్తోంది. నిమిషాల వ్యవధిలో…
జగనన్న గృహ సంకల్ప పథకాన్ని తణుకులో సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 వేల కోట్లు రుణమాఫీ వన్ టైం సెటిలేమెంట్ లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. 6 వేల కోట్లు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుందని, లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని, ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా లబ్ది పొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా…
ఈనెల 21న (మంగళవారం) ఏపీ సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం వినూత్నంగా ఆలోచించారు. బోకేలు, శాలువాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయని.. అదే ఒకరికి సాయం చేస్తే చిరకాలం గుర్తుంటుందని రోజా భావిస్తున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకుని చదివిస్తున్న రోజా.. ఈ ఏడాది నగరి నియోజకర్గంలోని ముస్లిం…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే కి సర్వం సిద్ధం అవుతోంది. జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపకల్పన చేశారు. సీఎం జగన్ పై ప్రత్యేకంగా పాటలు సిద్ధం చేయించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పాటల వీడియో…
ఏపీలో అధికారులు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ పీటముడి వీడడం లేదు. కాసేపట్లో ప్రారంభం కానుంది పీఆర్సీ పై కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు ప్రభుత్వ సలహాదారు సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు శశిభూషణ్, రావత్. అనంతరం సీఎంతో భేటీ కానుంది అధికారుల బృందం. ఐఆర్ 27 శాతం ఇస్తున్న నేపథ్యంలో దీని కంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదనపు…
ఏపీలో మందుబాబుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. జగన్ ప్రభుత్వం శనివారం శుభవార్త చెప్పింది. ఆదివారం నుంచే కొత్త ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మద్యం పన్ను రేట్లలో మార్పులు చేయడంతో ధరలు తగ్గనున్నాయి. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ…