విశాఖపట్నంతో పాటు అమరావతి కూడా బాగుండాలి అనేది తమ కోరిక అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు.. 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పిటిషన్ లో పొందుపరిచారు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో వచ్చామని.. రేపు మధ్యాహ్నం న్యాయస్ధానం వాదనలు వింటామన్నదని తెలిపారు.. ప్రజల ఆకాంక్షలను, ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటాం?…
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులే తమ విధానం అంటోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతాలని కలుపుకుని విశాఖ గర్జన జరిగింది.. నాన్ పొలిటిక్‌జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన వైసీపీ.. ఈ కార్యక్రమంలో మంత్రలు, పార్టీ నేతలు పాల్గొనేలా చేసింది.. ఇప్పుడు సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కార్..…
మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మరోసారి ప్రకటన చేయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయగా తాజాగా బీజేపీ కూడా జగన్ ప్రకటనను తప్పుబట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటపై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి రాజధానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కట్టుబడి ఉందని ఆయన…
ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మూడు రాజధానులపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఎంత నష్టపోయామో అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం అమరావతిలోనే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానులు ఆలోచన చేస్తోందన్నారు. ఈ మూడురాజధానులకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న దశలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు తర్వాత.. రాజధాని అమరావతి మరోసారి తెరపైకి వచ్చింది.. అయితే, తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. అదే తమ విధానం అంటూ స్పష్టం చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.. అతి అమరావతి కాదు కమ్మరావతి అని దుయ్యబట్టారు. మూడు రాజధానులకు చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. ప్రతివిషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఆర్‌డీఏ…
హైకోర్టు తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓవైపు.. లేదు మూడు రాజధానులే మా విధానం అంటూ మరోవైపు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, ఈ వ్యవహారంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఒకటికి పది సార్లు చెబుతున్నాం… మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. పాలనా వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్న ఆయన.. రాష్ట్ర విభజన…
మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష.. మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి, కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు అని మండిపడ్డారు.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన.. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కనిపిస్తోంది.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను…