శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తిరుపతి వాసుల్లో కలకలాన్ని రేపింది. తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ స్పందించింది. "ఏడు కొండలు వాడా... స్వామి మమ్ముల్ని క్షమించు... భక్తకోటిని క్షమించండి. నీ దర్శనానికి వచ్చిన వారికి ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించు." అని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరింది.
ఏపీ ఎన్నికల తరువాత తొలిసారి ఏపీ బీజేపీ విసృతస్థాయి సమవేశం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదని, సమావేశం కన్నుల పండువగా ఉందన్నారు. రెండు వేల మంది పాల్గొనడం ఆనందదాయకమని, దేశం లో 140కోట్ల జనభా తో ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు…
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వా తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన నేడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. రాజమహేంద్రవరం లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ,…
రాష్ట్రంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. మంగళవారం నుంచి నామినేషన్లు ప్రారంభించనుంది.
ఆ జిల్లాలో బిజెపికి అసెంబ్లీ టికెట్లు నిల్…ఒక్క ఎంపీ సీటయినా దక్కుతుందా ? బిజెపికి ఇస్తే అభ్యర్థి ఎవరు ? పురంధరేశ్వరికి ఇస్తారా ? సోము వీర్రాజుకు ఎసరు పెడతారా ? ఎంపీ టికెట్ ఆశించిన నేతలకు నిరాశ తప్పలేదా ? పురందేశ్వరికి ఇస్తే సోము వీర్రాజుతో పాటు టీడీపీ నేతలు సహకరిస్తారా ? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బిజెపికి షాక్ తగిలింది. 19 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులో బిజెపికి ఒక్క సీటు కూడా దక్కలేదు. టిడిపి…
తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకుగాను 15 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. అందులో ఎక్కువ మంది కొత్తగా పార్టీలో చేరిన వారే. అసలు కొందరైతే… కేవలం సీటు కోసమే… ఇటీవల పార్టీలో చేరారన్న టాక్ నడుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఏడుగురు అభ్యర్థుల్ని అదే కోణంలో చూస్తున్నాయట కాషాయ శ్రేణులు. అందుకే క్షేత్ర స్థాయిలో వారికి సహకరించడం లేదన్న ఫీడ్ బ్యాక్ వస్తోందట పార్టీ రాష్ట్ర కార్యాలయానికి. కేవలం పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలో…
ఏపీ బీజేపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదా? ఎంపీ సీట్ల విషయంలో ఫర్వాలేదనుకున్నా… అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం కాగడాలు పట్టుకు తిరుగుతున్నారా? అసలు ఎంపిక కసరత్తు ఏ దశలో ఉందో ఆ పార్టీ నేతలకు కూడా తెలియకపోవడానికి కారణాలేంటి? కేవలం ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ఎంపిక కోసం ఇంత జాప్యం దేనికి? ఏపీ పొత్తులో భాగంగా ఆరు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది బీజేపీ.…