ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి రాష్ట్రంలో ఇన్నాళ్లు పార్టీ పరిస్థితులకు భిన్నంగా... కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంత కూటమిలో ఉన్నా... అధికారం చెలాయిస్తున్నా... సొంత బలం ఉంటేనే గౌరవం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ కాషాయదళం... ఆ దిశగా అడుగులేస్తోందట.
ఏపీ బీజేపీ కేడర్‌ని ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తోందట. కార్యక్రమం ఏదైనాసరే.... ఆ... చూద్దాంలే, చెప్పినప్పుడు చేద్దాంలే అన్నట్టుగా ఉంటున్నారు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులతో సహా... ఎవ్వరూ యాక్టివ్ రోల్ తీసుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందులాగా... మేమున్నాం అంటూ పార్టీ కోసం ముందుకు రావడం లేదట. దీంతో చిన్న కార్యక్రమం చేయాలన్నా మందిని పోగేయడం పెద్ద టాస్క్‌గా మారిందని చెబుతున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తున్నారు.. అయితే.. ప్రధాని రాకను కూటమి పార్టీలు తమ స్టైల్ లో వినియోగించుకుంటున్నాయట.. బీజేపీ సైతం భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించిందట.. ప్రతీ జిల్లా నుంచి కో-ఆర్డినేటర్లను సిద్ధం చేసారట.. అలాగే ప్రధానంగా బీజేపీ లుక్ కనిపించేలా చూడాలని కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారట..
ఏపీ బీజేపీ నేతలు వర్గాలుగా విడిపోయారా ? పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టేసి…ఆధిపత్యం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారా ? మా టైం వచ్చిందని చెబుతున్నదెవరు ? ఆ సీనియర్ నేతకు పదవి రావడంతోనే…కమలం దళంలో చీలికలు వచ్చాయా ? ఇంతకీ ఎవరా నేతలు ? ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త వివాదం మొదలైంది. నిన్న మొన్నటి దాకా…ఎలాంటి గ్రూపులు లేకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు పని చేశారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. రాష్ట్ర పార్టీ…
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సన్నివేశాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయా? కొద్దో గొప్పో పసుపు ఫ్లేవర్ తగిలితేనే కాషాయ దళంలో పదవులు దక్కుతున్నాయా? పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామంటూ జబ్బలు చరుచుకునేవారికి చివరికి మిగిలేదా వాపులు, కాపడాలేనా? ఏపీ కమలంలో ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే వాళ్ళ సంఖ్య పెరుగుతోందా? పార్టీలో అసలేం జరుగుతోంది? నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు? కేవలం కాషాయం ఒక్కటే ఉంటే సరిపోదు…. అదనంగా కాస్త పసుపు కలర్‌ని జోడిస్తేనే పదవులు అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మాట్లాడుకుంటున్నారట.…
ఏపీ బీజేపీలో కొత్త ఆశలు రేగుతున్నాయి. త్వరలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ సీట్ల కోసం నాయకులు చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట.వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. అందులో ఒకటి బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉందన్న అంచనాతో... రాష్ట్ర పార్టీ సీనియర్స్ పావులు కదుపుతున్నట్టు సమాచారం.
క్షేత్ర స్ధాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని బలోపేతం చేయడంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. 50 రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఏపీలో జిల్లా అధ్యక్షులకు నియామకం పూర్తవడంతో.. ఇక అధ్యక్ష పదవిపై అందరి దృష్టి నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి ఉన్నారని తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసుపై…
ఈ రోజు పలు జిల్లాల అధ్యక్షులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్.. మొత్తంగా 24 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది బీజేపీ..
ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే.. రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్దమైంది. బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియామకంపై అధిష్టానం…