రేపటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి (నవంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ హాజరుకావటం లేదు. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే…
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ శాసన సభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ , శాసన మండలి సమావేశాల నోటిఫికేషన్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ జారీ చేశారు.
AP Cabinet: నవంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు భేటీ కానున్నారు. అమరావతిలో గల సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
విశాఖ డెయిరీ యాజమాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు... అయితే, విశాఖ డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్.. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆనంద్.. అయితే, విశాఖ డెయిరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్.. రైతుల సొమ్ములతో డెయిరీ పాలకవర్గం సోకులు చేస్తోంది.. అవసరమైతే చైర్మన్ ను జైలుకు ఈడుస్తాం అని హెచ్చరించారు..
జగన్ కాని.. వైసీపీ ఎమ్మెల్యే లు కానీ.. మీడియాలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరితే సభాపతిగా తాను తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.. 16వ శాసన సభ మొదటి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు.. శాసన సభలో సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని.. అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటిగా పేర్కొన్నారు..
నేడు కార్గిల్‌లో వీర అమరవీరులకు ప్రధాని నివాళి.. ఎత్తైన సొరంగం నిర్మాణానికి శంకుస్థాపన..! 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లోపర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు. నేటి ఉదయం 9:20 గంటలకు కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు మోడీ నివాళులర్పిస్తారు. అంతేకాకుండా షింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. అయితే, ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ (ఎక్స్ )…