ఏపీ శాసన మండలి నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన డయేరియా మరణాలపై పశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్ని మరణాలు జరిగాయి, చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
Minister Rama Naidu: 2014-19లో గత టీడీపీ పాలనలో రూ.3038 కోట్లు ఖర్చుపెట్టి 40 పనులు పూర్తి చేశామని.. 2019-24 వైసీపీ పాలనలో కేవలం రూ. 760 కోట్లు ఖర్చుపెట్టి 5 శాతం పనులు మాత్రమే చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ వేదికగా తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై తమ అనుచరులతో ఎన్జీటీలో వైసీపీ కేసులు వేయించిందని చెప్పారు. 2021 డిసెంబర్‌లో వైసీపీ అధికారంలో ఉండగానే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు ఎన్జీటీ…
Raghu Rama Krishna Raju: ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు మంగళవారం నాడు ఖరారు చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు అసెంబ్లీలో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు - 2024 ను అసెంబ్లీలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు.
మరోసారి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు... అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహించారు.. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ లో మరింత ప్రాధాన్యత కల్పించారు... బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. అయితే, బడ్జెట్ సమావేశాలపై…
కూటమి శాసన సభాపక్ష సమావేశం ముగిసింది.. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసన సభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 150 రోజుల పాలనలో చేసిన అన్ని అంశాలపై చర్చ సాగింది.. మంత్రులు.. ఎమ్మెల్యేలకు అన్ని విషయాలలో సహకరించాలని సూచించారు.. ఎమ్మెల్యేలు అందరూ హుందాగా ఉండటం అలవాటు చేసుకోవాలన్న ఆయన.. ప్రతిపక్షం లేదని నిర్లక్ష్య ధోరణి వద్దు అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు..
వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. అయితే, ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి అన్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
ఈరోజు అసెంబ్లీలో ఆర్ధిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2.9లక్షల కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేశవ్ నివాసానికి ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు చేరుకుని బడ్జెట్ పత్రాలను మంత్రికి అందించారు.
నేటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. 11 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.