గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగారు. ధూళిపాళ్లకు వ్యతిరేకంగా గోబ్యాక్ నరేంద్ర, డౌన్ డౌన్ నరేంద్ర అంటూ…