సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు అందం ఉండాలి. ఈ రెండింటిలో ఏది తక్కువ అయినా ఆ హీరోయిన్ కెరీర్ కష్టాల్లో పడినట్లే. అయితే కొందరి హీరోయిన్స్ అందంతోనే కెరీర్ ని ముందుకి తీసుకోని వెళ్తుంటారు. అందాన్ని నమ్ముకోని ముందుకి వెళ్తున్న హీరోయిన్స్ లో ముందు చెప్పాల్సిన పేరు ‘అను ఇమ్మాన్యుయేల్’. ఈ ఫారిన్ బ్యూటీకి మన దర్శకులు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వలేదో ఏమో తెలియదు…
శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించించిన చిత్రం “మహా సముద్రం”. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేసారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు హీరోయిన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. అసలు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు ? అనే విషయం అర్థమే కాలేదు. అయితే తాజాగా ఆమెకు…