సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు అందం ఉండాలి. ఈ రెండింటిలో ఏది తక్కువ అయినా ఆ హీరోయిన్ కెరీర్ కష్టాల్లో పడినట్లే. అయితే కొందరి హీరోయిన్స్ అందంతోనే కెరీర్ ని ముందుకి తీసుకోని వెళ్తుంటారు. అందాన్ని నమ్ముకోని ముందుకి వెళ్తున్న హీరోయిన్స్ లో ముందు చెప్పాల్సిన పేరు ‘అను ఇమ్మాన్యుయేల్’. ఈ ఫారిన్ బ్యూటీకి మన దర్శకులు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వలేదో ఏమో తెలియదు కానీ అను ఇమ్మాన్యుయేల్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసింది అని చెప్పుకునే సినిమా ఒక్కటి కూడా పడలేదు. తన గ్లామర్ నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్, మరోసారి సోషల్ మీడియాలో తన కొత్త లుక్ ఫోటోస్ పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. చీర కట్జీటుకోని తన జీరో సైజ్ నడుము అందాలని చూపిస్తూ ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఇక అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ విషయానికి వస్తే… నాని నటించిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైనా ఈ బ్యూటీ, ఆ తర్వాత ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే అంత బిజీ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తుంది కానీ హిట్ అనేది మాత్రం అను ఇమ్మాన్యుయేల్ కి ఇప్పటివరకూ దక్కలేదు.
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమాతో అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ మారిపోతుందని అంతా అనుకున్నారు కానీ ఆ మూవీ అను ఇమ్మాన్యుయేల్ కే కాదు అందరికీ షాక్ ఇచ్చింది. పవన్ తర్వాత అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటించింది, ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ‘శైలజ రెడ్డి అల్లుడు’ సినిమా కాస్త పరవాలేదనిపించింది కానీ అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ టర్న్ చేసే సినిమా అవ్వలేదు. ఇక ‘మహా సముద్రం’ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా మంచి టాక్ నే రాబట్టింది కానీ బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేయలేకపోయింది. దీంతో హిట్ కోసం అను ఇమ్మాన్యుయేల్ మరి కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పట్లేదు. ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ ఆశలన్నీ రవితేజతో చేస్తున్న ‘రావణాసుర’, కార్తీతో నటిస్తున్న ‘జపాన్’ సినిమాలపైనే ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ హిట్ అయితేనే అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ కి బూస్ట్ వస్తుంది లేదంటే అమ్మడి కెరీర్ దాదాపు ఎండ్ అయిపోయినట్లే.